APPSC GROUP-1 SERVICES 78 VACANCIES

APPSC GROUP-1 SERVICES 78 VACANCIES

* మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష
* ఆగస్టులో మెయిన్స్


ఏపీపీఎస్సీ నిరుద్యోగుల‌కు కొత్త సంవ‌త్సరంలో తీపి క‌బురు అందించింది. డిసెంబ‌రు 31న 8 కొత్త నోటిఫికేష‌న్లను విడుద‌ల‌ చేసింది. వీటిలో గ్రూప్‌-1 కు సంబంధించి 78 ఖాళీలు ఉన్నాయి. ఇందులో డిప్యూటీ క‌లెక్టర్లు 5, క‌మ‌ర్షియ‌ల్ ట్యాక్స్ ఆఫీస‌ర్లు 13, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ 6, డీఎస్పీ 24, అసిస్టెంట్ ప్రొహిబిష‌న్ అండ్ ఎక్సైజ్ సూప‌రింటెండెంట్ 10, బీసీ వెల్ఫేర్ ఆఫీస‌ర్ 2, గ్రేడ్ 2 మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ 8, అసిస్టెంట్ లేబ‌ర్ క‌మిష‌న‌ర్ 10 పోస్టులు ఉన్నాయి. డిగ్రీ ఉత్తీర్ణులు వీటికి పోటీ ప‌డ‌వ‌చ్చు. మే 7న ప్రిలిమిన‌రీ ప‌రీక్ష నిర్వహించ‌డానికి అవ‌కాశాలు ఉన్నాయి. ఆగ‌స్టు 17 నుంచి 27 వ‌ర‌కు మెయిన్స్ ప‌రీక్షలు ఉంటాయి.
పోస్టుల వివరాలు......
1) డిప్యూటీ కలెక్టర్: 05
2) కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్: 13
3) డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్: 06
4) డిప్యూటీ సూప‌రెంటెండెంట్ ఆఫ్ పోలీస్‌ (డీఎస్పీ): 24
5) అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూప‌రెంటెండెంట్: 10
6) డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్: 02
7) మునిసిపల్ కమిషనర్ (గ్రేడ్ 2): 08
8) అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్: 10
అర్హత: ఏదైనా డిగ్రీ. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోస్టుకు లా లేదా సోషల్ వర్కులో పీజీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
గరిష్ఠ వయోపరిమితి: ఎక్సైజ్ సూప‌రెంటెండెంట్ పోస్టుకు 28 ఏళ్లు, డీఎస్పీ పోస్టుకు 30 ఏళ్లు, మిగిలిన అన్ని పోస్టులకు 42 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ఎంపిక: ప్రిలిమనరీ, మెయిన్ టెస్ట్ , INTERVIEW ద్వారా
ప్రిలిమనరీ రాతపరీక్ష: 07.05.2017
మెయిన్ రాతపరీక్ష: 17.08.2017 నుంచి 27.08.2017 వరకు
దరఖాస్తు: ఆన్‌లైన్‌
ఆన్‌లైన్‌ దరఖాస్తు: 31.12.2016 నుంచి 30.01.2017 వరకు
Online Application
Notification

APPSC GROUP-1 78 VACANCIES

APPSC DEPUTY SURVEYOR AND OTHER 361 VACANCIES

ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న వివిధ రకాల 361 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. వీటిలో 259 డిప్యూటీ సర్వేయర్లు, 13 టౌన్ ప్లానింగ్ సర్వేయర్లు, 39 మైనింగ్ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు మరికొన్ని ఉద్యోగాలు ఉన్నాయి. జనవరి 23 వరకు ఈ పోస్టుల కోసం అభ్యర్ధులు దరఖాస్తులు చేసుకునే సౌకర్యం ఉంది.
పూర్తి వివరాలకు www.psc.ap.gov.in చూడగలరు

Indian Bank Recruitment 2016 - 324 Probationary Officer Posts


ప్రభుత్వ రంగానికి చెందిన ఇండియ‌న్ బ్యాంకు 324 పీవో పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. ఆన్‌లైన్ ప్రిలిమిన‌రీ, మెయిన్ ప‌రీక్షలు, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అన్ని ద‌శ‌ల‌నూ విజ‌య‌వంతంగా పూర్తిచేసుకున్నవాళ్లు మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌లో ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. అనంత‌రం ఇండియ‌న్ బ్యాంకులో పీవో కొలువు సొంత‌మ‌వుతుంది. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 324. వీటిలో ఎస్సీ-48 , ఎస్టీ-24, ఓబీసీ-87, జ‌న‌ర‌ల్‌-165 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: జులై 1, 2017 నాటికి 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు.
Syndicate Bank Recruitment 2016 –  400 Probationary Officer Posts

Syndicate Bank Recruitment 2016 – 400 Probationary Officer Posts


* ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా నియామ‌కాలు
* ఎంపికైన‌వారికి ఏడాది పీజీడీబీఏ కోర్సు
* అనంత‌రం పీవో కొలువు

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక‌టైన సిండికేట్‌ 400 ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి ప్రక‌ట‌న విడుద‌ల‌చేసింది. సింగిల్ స్టేజ్ ఆన్‌లైన్ ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూల ద్వారా అభ్యర్థుల‌ను ఎంపిక‌చేస్తారు. అనంత‌రం మ‌ణిపాల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్‌ -మంగుళూరు లేదా ఎన్ఐటీటీఈ యూనివ‌ర్సిటీ- గ్రేట‌ర్ నోయిడాల్లో ఏదో ఒక చోట‌ ఏడాది వ్యవ‌ధితో పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌ (పీజీడీబీఎఫ్‌) కోర్సు చ‌ద‌వాల్సి ఉంటుంది. విజ‌య‌వంతంగా కోర్సును పూర్తిచేసుకున్నవారిని ప్రొబేష‌న‌రీ ఆఫీస‌ర్ (పీవో)/ అసిస్టెంట్ మేనేజ‌ర్ హోదాతో సిండికేట్ బ్యాంక్‌లోకి తీసుకుంటారు. ప్రక‌ట‌న‌కు సంబంధించి పూర్తి స‌మాచారం తెలుసుకుందాం.
మొత్తం ఖాళీలు: 400. వీటిలో అన్ రిజ‌ర్వ్‌డ్‌-202, ఎస్సీ-60 , ఎస్టీ-30, ఓబీసీ-108 ఖాళీలు ఉన్నాయి.
అర్హత‌: 60 శాతం మార్కుల‌తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత‌. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 55 శాతం మార్కులు. (అక్టోబ‌రు 1, 2016 నాటికి అభ్యర్థులు ఉత్తీర్ణులై ఉండాలి)

Countries and Capitals Test2


Start Quiz




Countries and Capitals Test2



Common mistakes in Nouns1

Common mistakes in Nouns

Plural Forms of Nouns

Generally the plural is formed by adding -s to the singular e.g. boy, boys-, chair, chairs. Errors committed while forming plurals should be avoided. The incorrect and correct plural forms of some nouns are shown below:

State Bank of India- 103 specialist officers vacancies last date:16.12.2016

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్త్ మేనేజ్‌మెంట్ విభాగంలో స్పెష‌లైజ్డ్ ఆఫీస‌ర్స్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు....
* స్పెష‌లైజ్డ్ ఆఫీస‌ర్స్‌: 103 పోస్టులు
1) అక్విజిష‌న్ రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్‌: 34
2) రిలేష‌న్‌షిప్ మేనేజ‌ర్‌: 55

Rayalaseema University- 15 Associate lecturer vacancies

కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ.. వివిధ విభాగాల్లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
విభాగాలు: (ఆర్ట్స్):బిజినెస్ మేనేజ్‌మెంట్ (ఖాళీలు: 2), ఎడ్యుకేషన్ (ఖాళీలు: 2), ఇంగ్లిష్ (ఖాళీలు: 2).
(సెన్సైస్): బోటని (ఖాళీలు: 2), కంప్యూటర్ సైన్స్ (ఖాళీలు: 2), మ్యాథ్స్ (ఖాళీలు: 2), జువాలజీ (ఖాళీలు: 2).

Bank of Baroda- 190 pune, sweeper vacancies in Andhra, Telangana

తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంక్ ఆఫ్ బరోడా శాఖల్లో ఖాళీగా ఉన్న 190 ఫ్యూన్, స్వీపర్ కమ్-ఫ్యూన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో 144 ఖాళీలు ఉండగా.. తెలంగాణలో 46 పోస్టులు ఉన్నాయి. పదోతరగతి విద్యార్హత కాగా.. ఆన్‌లైన్ దరఖాస్తుకు డిసెంబర్ 16 చివరితేదీ. పూర్తి వివరాలకు www.bankofbaroda.co.inఅనే వెబ్‌సైట్‌ని సంప్రదించవచ్చు.

Detailed Notification Andhra Pradesh
Apply Online Andhra

Detailed Notification Telangana
Apply Online Telangana

Bank of Baroda- 190 pune, sweeper vacancies in Andhra, Telangana